భారతదేశం, సెప్టెంబర్ 23 -- వైదిక జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాశి మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జ్ఞానం, అదృష్టం, సంపదకుకారకుడైన దేవగురు బృహస్పతి సంచార మార్పు మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు, రాబోయే అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు సింహ రాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ రాశి మార్పు కారణంగా మొత్తం ఐదు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి.

సూర్యుని సంచార శక్తికి, గురుని శుభ దృష్టి తోడవ్వడంతో ఈ రాశుల వారిలో నాయకత్వ లక్షణాలు (లీడర్‌షిప్ క్వాలిటీస్) మరింత పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడంతో పాటు వృత్తి, వ్యాపార రంగాల్లో తిరుగులేని గుర్తింపు, విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆ ప్రత్యేక రాశుల వివరాలు చూద్దాం.

గురుని ఈ సంచారం మేష రాశి వారికి అనేక రంగా...