భారతదేశం, మే 29 -- జూన్ 2026లో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు రాబోతున్నాయి. ఈ గ్రహాల సంచారంలో మార్పు వలన 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. గురువు జూన్ 2న తన సంచారంలో మార్పు చేస్తాడు. అలాగే శుక్రుడు, సూర్యుడు ఇలా ఇతర ప్రధాన గ్రహాల సంచారంలో కూడా మార్పు వస్తుంది. దీంతో 12 రాశుల వారి ఆర్థిక జీవితంపై ఎంతో ప్రభావం పడుతుంది. మరి 12 రాశుల వారికి ఆర్థికపరంగా జూన్ నెలలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆర్థిక ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారు ఈ నెలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా కాన్ఫిడెన్స్‌గా, ధైర్యంగా ఉంటారు. కెరీర్‌లో మంచి మలుపు ఉంటుంది. కమ్యూనికేషన్ పరంగా బాగుంటుంది. సీనియర్ ఆఫీసర్ల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్లు, కొత్త బాధ్యతలను చేపడతారు. జూన్ 15 తర్వాత పనికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్...