భారతదేశం, మే 28 -- June 2026 Lucky Rasis: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా 2026 జూన్ నెల గ్రహ సంచారాల పరంగా అత్యంత కీలకమైనదిగా మారుతోంది. ఈ నెలలో దేవగురువు బృహస్పతి తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించబోతున్నాడు. ఒక గ్రహం తన ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది. గురువు కర్కాటకంలోకి రావడం వల్ల అత్యంత శక్తివంతమైన 'హంస రాజయోగం' ఏర్పడుతోంది.

దీనితో పాటు, బుధుడు మరియు శుక్రుడు మిథున, కర్కాటక రాశులలో కలవడం వల్ల 'లక్ష్మీ నారాయణ రాజయోగం' కూడా సిద్ధిస్తోంది. ఇలాంటి అరుదైన రాజయోగాలు ఒకే నెలలో సంభవించడం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా తిరుగులేని అదృష్టం వరించనుంది. ముఖ్యంగా జూన్ 1 నుంచి ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూ...