భారతదేశం, నవంబర్ 24 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో దాదాపు రెండు దశాబ్దాలుగా డీ-సెగ్మెంట్ ల్యాడర్-ఫ్రేమ్ ఎస్‌యూవీ విభాగానికి టయోటా ఫార్చ్యూనర్ తిరుగులేని రారాజుగా కొనసాగుతోంది. నమ్మదగిన పనితీరు, అద్భుతమైన రీసేల్ విలువ, శక్తివంతమైన డీజిల్ ఇంజిన్, రోడ్డుపై మరే కారుకూ సాధ్యం కాని గంభీరమైన రూపంతో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. అయితే చరిత్రలో ఏ చక్రవర్తికైనా ఏదో ఒక రోజు బలమైన పోటీదారు ఎదురుకాక తప్పదు. ఇప్పుడు సరిగ్గా అలాంటి సవాల్ విసరడానికే 'జేఎస్‌డబ్ల్యూ కాంబాట్' ఎస్‌యూవీ సిద్ధమవుతోంది! అమ్మకాల పరంగా ఫార్చ్యూనర్ రికార్డులను ఈ కొత్త కారు అందుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి. కానీ దశాబ్దాలుగా టయోటా కారునే నమ్ముకున్న కొనుగోలుదారులను సైతం ఒక్కసారి ఆలోచింపజేసే సత్తా ఈ వాహనానికి పుష్కలంగా ఉంది.

రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపార...