భారతదేశం, ఆగస్టు 12 -- Jr NTR Surgery: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఊరటనిచ్చే వార్త బయటకు వచ్చింది. భుజం గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్‌కు సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ (Arthroscopic Surgery) విజయవంతంగా పూర్తయింది.

డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సుర్గప్నేని నేతృత్వంలోని నిపుణులైన ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి చాలా స్థిరంగా ఉందని, త్వరలోనే ప్రత్యేక ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తారని వైద్యులు వెల్లడించారు.

భుజానికి సర్జరీ సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు ధీమా వ్యక్తం చేశారు. అయితే...