భారతదేశం, సెప్టెంబర్ 3 -- Jr NTR Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (Dragon) కాస్టింగ్ గురించి ఒక బిగ్గెస్ట్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆలియా భట్ అధికారికంగా జాయిన్ అయ్యారు.

ప్రముఖ ఫిలిం పోర్టల్ గుల్టే (Gulte) రిపోర్టు ప్రకారం.. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎపిక్‌లో షాహిద్ కపూర్, ఆలియా భట్ అత్యంత కీలకమైన పాత్రల్లో నటించనున్నారు. గతంలో 'ఉడ్తా పంజాబ్', 'షాందార్' వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు బాలీవుడ్ స్టార్స్, ఇప్పుడు ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమా ద్వారా మళ్లీ ఒకే స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.

పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనా...