భారతదేశం, ఏప్రిల్ 14 -- ఆంధ్రప్రదేశ్‌లోని త్వరలో జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఉగాది పర్వదినం సందర్భంగా విడుదల చేసిన వార్షిక ఉద్యోగ క్యాలెండర్‌లో భాగంగా.. ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 1,500 అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ నియామకాలను పూర్తి చేయడం ద్వారా విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లోనే సుమారు 500 ఖాళీలు ఉన్నట్లు వైస్-ఛాన్సలర్ తెలిపారు. ఒంగోలులోని ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయానికి కనీసం 100 మంది కొత్త అధ్యాపకులు అవసరం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాబోయే రెండేళ్లలో భారీగా రిటైర్మెంట్లు ఉండటంతో ఈ నియామకాలు అత్యవసరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మార్చి మొదటి ...