భారతదేశం, అక్టోబర్ 12 -- Jo Jo Glimpse: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అనే గమనికతో గ్లింప్స్ వీడియోతోనే సంచలనం రేపుతోంది జో జో మూవీ. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ దేవా కట్టా సమర్పణలో వస్తోన్న సరికొత్త రస్టిక్ రూరల్ కామెడీ డ్రామా 'జో జో' (Jo Jo). తాజాగా ఈ సినిమా నుంచి 'కాషన్ 1' (Caution 1) పేరుతో విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

రాయలసీమలోని ప్రసిద్ధ జొన్నగిరి ప్రాంతంలో వర్షాకాలం తర్వాత వజ్రాలు వెతికే విచిత్రమైన ఆచారం, అక్కడి స్థానిక వాతావరణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కిరణ్ జై కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని నిర్మిస్తున్నారు. ఎలాంటి హంగులకు పోకుండా చాలా సహజమైన సంభాషణలు, ముతక హాస్యంతో కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేసింది....