భారతదేశం, నవంబర్ 18 -- Jiohotstar Web Series: ఓటీటీ ప్రియుల కోసం జియోహాట్‌స్టార్ (JioHotstar) మరో సరికొత్త ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్.. ఇప్పుడు వర్క్‌ప్లేస్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీ సిరీస్‌ను మన ముందుకు తెచ్చింది.

హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా 'మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్' (Mr & Mrs Office) అనే వెబ్ సిరీస్ ఇవాళ (నవంబర్ 18) నుంచి జియోహాట్‌స్టార్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. నేటి యువత ఎదుర్కొంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కష్టాలు, ఆఫీస్ రాజకీయాలు, దానికి తోడు కెరీర్-లైఫ్ బ్యాలెన్స్.. ఇలా అన్నింటినీ కలిపి ఒక అద్భుతమైన ఓటీటీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ అబ్దుల్ కబీజ్ ఈ సిరీస్‌ను రూపొందించారు.

అరివు, ఐశ్వర్య జంటకు పెళ్లి అవుతుంది. అ...