భారతదేశం, అక్టోబర్ 7 -- Jiohotstar Top 10: ఓటీటీ ప్రపంచంలో జియోహాట్‌స్టార్ (JioHotstar) సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 20' మొదటి స్థానాన్ని దక్కించుకోగా, ఇటీవల ముగిసిన 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' గ్రాండ్ ఫినాలే టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ కామెడీలు, రొమాంటిక్ డ్రామాలతో ఈ వారం హాట్‌స్టార్ వీక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది.

1. బిగ్ బాస్ 20 (Bigg Boss 20): బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ నడిపిస్తున్న బిగ్ బాస్ 20 జియోహాట్‌స్టార్ ఓటీటీలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే హౌస్ నుంచి రీతి తివారి, ఈషా రిఖీ, రోహెద్ ఖాన్ ఎలిమినేట్ కాగా, లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఫేమస్ గేమర్ స్కౌట్ ఓపీ, కాజీ తౌకీర్ మధ్య జరిగిన రచ్చ షోలో వాతావరణాన్ని మరింత వేడెక్కి...