భారతదేశం, అక్టోబర్ 27 -- Jiohotstar Releases: ఈ అక్టోబర్ చివరి వారం ఓటీటీ ప్రియులకు వినోదాల పండుగ కానుంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా సరికొత్త కంటెంట్‌ను సిద్ధం చేసింది. అక్టోబర్ 26 నుంచి అక్టోబర్ 30 మధ్య విడుదలయ్యే ఈ టైటిల్స్ లో యాక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్స్, డ్రామా, రొమాన్స్, కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉంటాయి. మీ వీకెండ్ వాచ్‌లిస్ట్‌ను ప్లాన్ చేసుకోవడానికి జియో హాట్‌స్టార్‌లో రాబోతున్న ఆ 6 ప్రధాన శీర్షికల పూర్తి వివరాలు ఇవే.

ఇటీవల థియేటర్లలో విడుదలైన 'హనుమాన్ అంశ్' చిత్రంలోని 'పార్వతి' పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడమే కాకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ పాట తెచ్చిన క్రేజ్‌తో ప్రేరణ పొంది, పురాణా...