భారతదేశం, మే 19 -- Jiohotstar: బాలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ రేట్ ఉన్న క్రేజీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే, సంజూ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. నిర్మాతగా ఇప్పుడు సరికొత్త వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమయ్యారు. 'హాట్‌స్టార్ స్పెషల్స్'గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక సిరీస్ పేరు 'ప్రీతమ్ అండ్ పెడ్రో'.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. జులై 3వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్'లో ఈ సిరీస్ ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. సినిమా రంగంలో తనదైన క్లాసిక్ కామెడీ, ఎమోషన్స్‌తో మ్యాజిక్ చేసే హిరానీ.. ఈ వెబ్ సిరీస్‌ను క్రియేట్ చేయడంతోపాటు ప్రొడ్...