భారతదేశం, ఆగస్టు 8 -- Jio OTT Pass New Plans Launched: టెలికాం రంగంలో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టించే రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ యూజర్లకు డిజిటల్ వినోదాన్ని మరింత చవకగా అందించేందుకు రంగం సిద్ధం చేసింది. మార్కెట్‌లో విశేష ఆదరణ పొందుతున్న 'జియో ఓటీటీ-పాస్' (Jio OTT-Pass) పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది.

ఇందులో భాగంగా 3 నెలలు (84 రోజులు), అలాగే ఒక సంవత్సరం (365 రోజులు) వ్యాలిడిటీతో పనిచేసే రెండు కొత్త డేటా యాడ్-ఆన్ ప్లాన్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల కోసం నెలకు వేల రూపాయలు ఖర్చు చేసే వినోద ప్రియులకు ఈ ప్లాన్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

యూజర్ల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ మూడు ప్రధాన విభాగాల్లో ఈ ఓటీటీ పాస్‌లను అందిస్తోంది.

రూ. 200 ఓటీటీ పాస్: 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్‌లో 30 జీబీ హై-...