భారతదేశం, సెప్టెంబర్ 4 -- దేశీయ స్టాక్​ మార్కెట్లో సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్, టెలికాం విభాగానికి చెందిన 'జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్' అత్యంత భారీ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు సిద్ధమవుతోంది. సుమారు 4 బిలియన్ డాలర్ల (రూ. 37,700 కోట్లు) సమీకరించడమే లక్ష్యంగా వస్తున్న ఈ ఐపీఓ.. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో సబ్‌స్క్రిప్షన్ కోసం మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

అక్టోబర్ మూడవ వారంలో మొదలయ్యే నవరాత్రుల పండుగ సమయాన్ని (అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20 దసరా వరకు)జియో ఐపీఓ ప్రారంభానికి అనువైనదిగా కంపెనీ భావిస్తోందని తెలుస్తోంది. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగితే, నవంబర్ మొదటి వారంలో ధంతేరస్ (నవంబర్ 6), ...