భారతదేశం, ఏప్రిల్ 23 -- Jetlee Satya: ఓ వైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే.. మరోవైపు కామెడీ మూవీస్ లో హీరోగానూ సత్య అదరగొడుతున్నాడు. తాజాగా అతను లీడ్ రోల్ ప్లే చేస్తున్న మూవీ 'జెట్లీ' ట్రైలర్ రిలీజ్ అయింది. సత్యతో పాటు వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో సత్య స్పీచ్ వైరల్ గా మారింది.

తెలుగు కామెడీ ఎంటర్ టైనర్ 'జెట్లీ' మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కూడా చాలా సరదగా జరిగింది. తమ కామెడీ మూవీని ప్రమోట్ చేసేలా నటీ నటులందరూ ఫన్నీగా కనిపించారు. ఈ లాంఛ్ ఈవెంట్లో సత్య మరోసారి తన కామెడీ మార్క్ తో అందరినీ నవ్వించాడు.

'జెట్లీ' మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో వెన్నెల కిశోర్ మాట్లాడుతుండగా మైక్ తీసుకుని సత్య మాట్లాడాడు. డైరెక్టర్ రితేష్ రాణా ఇచ్చిన పేపర్ పై ఉన్న స్పీచ్ ను సత్య చదివేశ...