భారతదేశం, నవంబర్ 12 -- Jayanth and The Jingo Pen: కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న తరుణంలో, పిల్లల మనస్తత్వాన్ని, వారి ఆలోచనలను ప్రతిబింబించే కథలు రావడం చాలా అరుదు. ఆ లోటును భర్తీ చేస్తూ జాతీయ అవార్డు విజేత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రమే 'జయంత్ & ది జింగో పెన్'.

నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, చిన్నారులందరికీ సినిమా చేరువ కావాలనే ఉద్దేశంతో టికెట్ ధరను రూ. 250 నుంచి ఏకంగా రూ. 150కి తగ్గిస్తున్నట్లు నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి ప్రకటించారు.

సినిమా విడుదల నేపథ్యంలో చిత్రబృందం పంచుకున్న ఆసక్తికర విషయాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నాయి. నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. "ఈ సినిమాలోని భావోద్వేగాలు అన్ని వయసుల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా పిల్లల కోసం టికెట్ ధరలను తగ...