భారతదేశం, ఏప్రిల్ 10 -- Jayaho Janardhana Poster Launch: డిఫరెంట్ టైటిల్‌తో తెలుగులో వస్తోన్న లేటెస్ట్ మూవీ జయహో జనార్ధన. ఈ సినిమాను పానుగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా నిర్మిస్తున్నారు. అంతేకాకుండా నిర్మాత అయిన పానుగంటి శరత్ రెడ్డి స్వయంగా జయయో జనార్ధన సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

జయహో జనార్ధన సినిమాలో నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా చేశారు. అలాగే, వీరితోపాటు ఈ చిత్రంలో 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, బీవీఎమ్ శివశంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే, జయహో జనార్ధన సినిమాకి ఎడిటర్‌గా నందమూరి హరి, కెమెరామెన్‌గా విజయ్ ఠాగూర్ ఆర్ డైరెక్టర్‌గా భూపతి యాదగిరి పనిచేయగా చరణ్ అర్జున్ ...