భారతదేశం, జూలై 17 -- Jason Sanjay On Acting And Sigma Delayed: తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అయితే తండ్రిలా కెమెరా ముందుకు కాకుండా, కెమెరా వెనుక ఉండి కథను నడిపించే డైరెక్టర్‌గా ఆయన పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'సిగ్మా' అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా ద్వారా జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జేసన్ సంజయ్ తన సినీ ప్రయాణం, నటనపై ఆసక్తి, తండ్రితో బాక్సాఫీస్ పోటీపై మనసు విప్పి మాట్లాడారు.

తను నటుడిగా మారాల...