భారతదేశం, జూలై 20 -- నీట్​ యూజీ పరీక్షల అక్రమాలు, వరుస పేపర్ లీకేజీలపై దేశ రాజధాని దిల్లీలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ), పర్యావరణవేత్త సోనమ్ వాంగ్​చుక్ పిలుపునిచ్చిన 'చలో సంసద్' మార్చ్ ఉధృతంగా సాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది విద్యార్థులు, యువకులు, నిరసనకారులతో దిల్లీలోని జంతర్ మంతర్ పరిసరాలు జనసముద్రంగా మారాయి.

ఈ పార్లమెంట్​ మార్చ్​ అనేది కేవలం విద్యార్థుల నిరసనగానే కాకుండా, రాజకీయ, సినీ, సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో పాల్గొని విద్యార్థులకు బాసటగా నిలిచిన ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి:

చంద్రశేఖర్ ఆజాద్: ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్ష...