భారతదేశం, అక్టోబర్ 12 -- దేశ రాజధాని దిల్లీలో ప్రజాస్వామ్య నిరసనలకు నిలయంగా ఉన్న చారిత్రాత్మక జంతర్ మంతర్ వద్ద ఇకపై ధర్నాలు, ఆందోళనలు చేపట్టడానికి వీల్లేదు! దశాబ్దాలుగా ఉద్యమాలు, ధర్నాలకు వేదికగా నిలిచిన ఈ జంతర్ మంతర్‌ను నిరసనలు చేసే స్థలాల జాబితా నుంచి తొలగిస్తూ (డీ-నోటిఫై)దిల్లీ పోలీసులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జంతర్ మంతర్​కి ప్రత్యామ్నాయంగా నిరసనకారుల కోసం నగరంలోని మూడు విభిన్న ప్రాంతాలను నూతన ధర్నా చౌక్‌లుగా ఖరారు చేశారు.

పౌరులు తమ ఆందోళన తెలిపే హక్కును కాపాడుతూనే, నగరంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను అన్వేషించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదిక, సిఫార్సుల ప్రాతిపదికగానే దిల్లీ పోలీసులు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

పోలీ...