భారతదేశం, అక్టోబర్ 28 -- Janhvi Kapoor Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi). జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్ర చిత్రీకరణపై ప్రేక్షకులు, మహిళా సంఘాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

క్యారెక్టర్ పరిచయం చేసే సమయంలో జాన్వీ శరీరాకృతిపైనే కెమెరా కోణాలు ఎక్కువగా కేంద్రీకరించడం, అలాగే ఆమె అనుమతి లేకుండా హీరో ముద్దుపెట్టుకునే సీన్ల వల్ల మహిళలను తక్కువ చేసి చూపించారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' లో హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు జాన్వీ కపూర్ అత్యంత ఎమోషనల్ గా...