భారతదేశం, మే 5 -- Janhvi Kapoor Peddi: సమ్మర్ సందడి ముగిసిన వెంటనే బాక్సాఫీస్ వద్ద అసలైన సమరం మొదలుకాబోతోంది. జూన్ మొదటి వారంలో ఇద్దరు భారీ స్టార్ల చిత్రాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది', బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న రొమాంటిక్ కామెడీ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఈ బాక్సాఫీస్ క్లాష్ గురించి ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చ మొదలవ్వగా.. తాజాగా జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ మధ్య జరుగుతున్న ఫన్నీ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'పెద్ది' మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. వరుణ్ ధావన్‌ను ట్యాగ్ చేస్తూ ఒక కూల్ వీడియోను ఆమె షేర్ చేసింది. "అనుకు...