భారతదేశం, ఆగస్టు 11 -- Janhvi Kapoor OTT: బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలోనూ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) త్వరలోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. పెద్ది మూవీతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ భామ.. తమిళంలో వెబ్ సిరీస్ తో డిజిటల్ డెబ్యూ చేస్తుందని అంటున్నారు.

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. టాలీవుడ్ లో దేవర, పెద్ది సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. ఈ నేపథ్యంలో పెద్ది మూవీ తర్వాత జాన్వీ కపూర్ తమిళ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టనుందని తెలిసింది.

పాపులర్ ఓటీటీ దిగ్గజం 'నెట్‌ఫ్లిక్స్' (Netflix) ఈ సిరీస్ ను నిర్మిస్తుందని సమాచారం. జాన్వీ కపూర్ నటించనున్న ఈ క్రేజీ వెబ్ సిరీస్ కు 'కురత్తి' (Kurathi) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్న...