భారతదేశం, నవంబర్ 8 -- Janhvi Kapoor About Sridevi Changed DecisionL: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్, తన కెరీర్ ఆరంభంలో ఎదురైన అనుభవాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. భారతీయ సినిమాలో అత్యున్నత స్థానాన్ని అందుకున్న శ్రీదేవి, తన కూతురు నటిగా మారడంపై మొదట్లో పెద్దగా ఆసక్తి చూపించలేదట.

సినీ పరిశ్రమలో ఉండే కష్టం, ఒత్తిడి దృష్ట్యా జాన్వీ కపూర్ నటనపై మొగ్గు చూపినప్పుడు తల్లి శ్రీదేవి హెచ్చరించినట్లు చెప్పారు. "నేను నటిని అవుతానంటే అమ్మ మొదట్లో అస్సలు ఒప్పుకోలేదు. ఈ రంగంలో రాణించాలంటే ఎంతో శ్రమించాలి, ఎంతో మానసిక బలం ఉండాలి అని చెప్పేవారు" అని జాన్వీ కపూర్ గుర్తు చేసుకున్నారు.

శ్రీదేవి సోదరి కుమార్తె, నటి మహేశ్వరి కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొని అప్పటి పరిస్థితులను వివరించారు. "జాన్వి సినిమాల్లోకి రావాలనుకుంటోంది,...