భారతదేశం, మార్చి 6 -- బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ తన పుట్టినరోజును (మార్చి 6) తిరుమల శ్రీవారి సన్నిధిలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంది. ఏటా తన పుట్టినరోజున వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్న జాన్వీ.. ఈసారి తన మొక్కును తీర్చుకునేందుకు అలిపిరి మార్గం ద్వారా కాలినడకన కొండపైకి చేరుకుంది. ఈ సందర్భంగా జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్, జాన్వీ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. జాన్వీ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా తన ప్రియురాలు జాన్వీతో ఉన్న ఒక క్యూట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. హార్ట్ ఎమోజీతో "హ్యాపీ బర్త్ డే" అని పోస్ట్ చేశాడు.

జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ అయితే తన అక్క జాన్వీకి ...