భారతదేశం, మే 31 -- Janhvi Kapoor About Work Culture In Tollywood: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ తాజాగా టాలీవుడ్ పనితీరు (Work Culture)పై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీతో పోలిస్తే తెలుగు సినీ పరిశ్రమలో కనిపించే క్రమశిక్షణ, సమయపాలన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని జాన్వీ కపూర్ వెల్లడించింది. 'టైమ్స్ నౌ' ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ టాలీవుడ్ సెట్స్‌పై తన అనుభవాలను పంచుకుంది.

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన 'దేవర' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన జాన్వీ ...