భారతదేశం, అక్టోబర్ 4 -- Janhvi Kapoor Reacts To Chuttamalle Morphed: సాంకేతిక పరిజ్ఞానాన్ని విపరీతంగా దుర్వినియోగం చేస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న తీరుపై బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన 'దేవర' చిత్రంలోని పాపులర్ 'చుట్టమల్లె' సాంగ్ విజువల్స్‌ను ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో అశ్లీలంగా మార్చి సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన జాన్వీ కపూర్ ఇది కేవలం సాంకేతిక దుర్వినియోగం మాత్రమే కాదని, ఒక రకమైన లైంగిక దాడితో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించిన తర్వాత సినీ తారలే కాకుండా సామాన్య మహిళలు సైతం డీప్‌ఫేక్ మోసాల బారిన పడుతున్నారు. ఈ అంశంపై జాన్వీ కపూర్ సుదీర్ఘమైన నోట్...