భారతదేశం, అక్టోబర్ 18 -- Director Bobby Student Janakiram Marella First Debut Hit: తెలుగు చిత్రసీమలో తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందుకోవడం ఏ దర్శకుడికైనా అరుదైన ఘనత. దర్శకుడు జానకిరామ్ మారెళ్ల 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో ఆ ముచ్చట తీర్చుకున్నారు. మొదటి చిత్రంతోనే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుని టాలీవుడ్ ప్రముఖులు, సినీ ప్రియుల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

సినిమా విజయానికి బలమైన పునాది సహజమైన వినోదం. 'కామ్రేడ్ కళ్యాణ్'లో జానకిరామ్ చూపించిన కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వుల పూలు పూయించింది. అనవసరపు హడావుడి లేకుండా, కేవలం సంభాషణలతోనే ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకునేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు.

దైనందిన జీవితంలో చూసే సాధారణ ఘట్టాల నుంచే వినోదాన్ని రాబట్టడం ఈ దర్శకుడి ప్రత్యేకతను ఎలుగెత్తి చాటింది. కేవలం వినోదానికే పరిమితం కాకుండా, కమర...