భారతదేశం, ఏప్రిల్ 10 -- తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒకటే చర్చ.. దళపతి విజయ్ ఆఖరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan) థియేటర్లో విడుదలకు ముందే లీక్ అవ్వడం ఇప్పుడు కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. రాజకీయ అరంగేట్రం చేయబోతున్న విజయ్‌కి ఇది చివరి చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, థియేటర్లలో సినిమా సందడి చేయకముందే.. హెచ్‌డీ క్వాలిటీతో కూడిన ఫుల్ మూవీ పైరసీ సైట్లలో ప్రత్యక్షమైంది.

గత మూడు నెలలుగా సెన్సార్ బోర్డ్ (CBFC) నుంచి క్లియరెన్స్ రాక జన నాయగన్ మూవీ రిలీజ్ పెండింగ్‌లో ఉంది. గురువారం (ఏప్రిల్ 9) రాత్రి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని చిన్న క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ కాగా, శుక్రవారం (ఏప్రిల్ 10) ఉదయానికల్లా పూర్తి సినిమా పైరసీ సైట్లలో ప్రత్యక్షమైంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన నాయగన్ మూవీ లీక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి...