భారతదేశం, జూలై 12 -- CM Thalapathy Vijay Jana Nayagan Ticket Booking: తమిళ స్టార్ హీరో, ముఖ్యమంత్రి దళపతి విజయ్ అభిమానులకు, కోలీవుడ్ వర్గాలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది. టాలీవుడ్, కోలీవుడ్‌లలో విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హెచ్. వినోద్ కాంబినేషన్‌లో విజయ్ నటిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) ఎట్టకేలకు విడుదలకు లైన్ క్లియర్ చేసుకుంది.

గత కొన్ని నెలలుగా తీవ్ర సెన్సార్ వివాదాలతో నలిగిన ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరిలోనే థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే, సెన్సార్ ఎగ్జామినింగ్ కమిటీ సభ్యుడొకరు ఫిర్యాదు చేయడంతో సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్లింది.

దాదాపు ఏడు నెలల సుదీర్ఘ నిరీక్షణ, పలు కట్స్, మార్ప...