భారతదేశం, మే 4 -- Jana Nayagan: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అనూహ్య విజయాల దిశగా దూసుకుపోతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి అందిన ట్రెండ్స్ ప్రకారం.. మొత్తం స్థానాల్లో 107 చోట్ల టీవీకే ఆధిక్యంలో ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి విజయ్ కాబోతున్నారన్న సంకేతాలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ క్రమంలోనే ఆయన చివరి చిత్రం 'జననాయగన్' విడుదల కోసం ఫ్యాన్స్ నుంచి డిమాండ్ పెరుగుతోంది.

ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ ఆధిక్యం కనబరచగానే 'X' వేదికగా ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. "సినిమా కంటే ముందే నిజ జీవితంలో 'జన నాయగన్' (ప్రజా నాయకుడు) పాత్రను విజయ్ పోషించారు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. "సినిమా విడుదలను కొ...