భారతదేశం, అక్టోబర్ 25 -- Jailer 2 OTT Release Date: అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ 2 (Jailer 2) థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ 'టైగర్ ముత్తువేల్ పాండియన్' గా మరోసారి విశ్వరూపం చూపించారు. ఇప్పుడు థియేటర్లు జైలర్ 2 మేనియాతో ఊగిపోతున్నాయి.

ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం.. రిలీజైన కేవలం 9 రోజుల్లోనే జైలర్ 2 ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.628 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. ఇండియాలో రూ.350 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టి అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 20 ఇండియన్ సినిమాల లిస్ట్ లో చోటు దక్కించుకుంది.

థియేటర్లలో రికార్డులు కొల్లగొడుతున్న జైలర్ 2 ఓటీటీ రిలీజ్ పై షాకింగ్ బజ్ వైరల్ గా మారింది. ...