భారతదేశం, అక్టోబర్ 11 -- Jailer 2 Ticket Price Hike In Andhra Pradesh: సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండ్యన్‌గా థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమయ్యారు. రజనీకాంత్ నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ 'జైలర్ 2' అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

జైలర్ 2 సినిమా విడుదలకు మరో ఐదు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో చిత్రబృందం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రజనీ అభిమానులతో పాటు సినీ ప్రియులకు కీలకమైన అప్‌డేట్ అందించింది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 'జైలర్ 2' టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వమే నియంత్రిస్తుంది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లకు వేర్వేరు గరిష్ఠ ధరలను నిర్దేశిస్తూ ప్రభుత్వం నిబంధనలు అమ...