భారతదేశం, అక్టోబర్ 15 -- Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), తమిళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ మూవీ 'జైలర్ 2' (Jailer 2) థియేటర్లలో దూసుకుపోతుండగానే ఒక పెద్ద వివాదం రాజుకుంది. మలయాళ దిగ్గజ నటుడు, మోస్ట్ పాపులర్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) ఈ సినిమాలో పోషించిన 'మాథ్యూ' రోల్‌కు సంబంధించిన చాలా సీన్లను ఎడిటింగ్ టేబుల్ మీద లేపేయడంపై ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ జిషాద్ షంషుద్దీన్ బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం మాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఒక దిగ్గజ నటుడి క్యారెక్టర్ సీన్లను ఇలా అనవసరంగా కట్ చేయడం ఏంటని ఆయన టీమ్‌ను నిలదీశారు.

కాస్ట్యూమ్ డిజైనర్ జిషాద్ షంషుద్దీన్ ఇన...