భారతదేశం, అక్టోబర్ 30 -- తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు మంచి రేటు వస్తున్నాయి. ముఖ్యంగా సన్నధాన్యం, పత్తి పంటలకు వ్యాపారుల నుంచి విపరీతమైన డిమాండ్ కనిపిస్తుండటంతో క్వింటాల్ ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.

మహబూబాబాద్‌ మార్కెట్‌లో జైశ్రీరాం ధాన్యం హవా కనిపించింది. మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్ యార్డులో జైశ్రీరాం పాత రకం సన్నధాన్యానికి ఊహించని రీతిలో ధర లభించింది. జైశ్రీరాం సన్నధాన్యం: క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 5,555 లభించగా, కనిష్ఠ ధర రూ. 3,960 నమోదైంది. వ్యాపారులు సగటున రూ. 5,080 చొప్పున కొనుగోలు చేశారు.

ఇక ఆర్ఎన్ఆర్(RNR) రకం క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 4,885 పలికింది. హెచ్‌ఎంటీ (HMT) రకం గరిష్ఠంగా రూ. 4,930 లభించింది. ఈ రకం సన్న బియ్యానికి మార్కెట్, బ్రాండెడ్ రైస్ మిల్లుల నుంచి నిరం...