భారతదేశం, ఆగస్టు 8 -- జగిత్యాల జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై భౌతిక దాడికి పాల్పడటమే కాకుండా, వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్లతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని న్యాయస్థానంలో హాజరుపరిచి జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 3న సదరు మహిళ మరొక వ్యక్తితో కలిసి మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు హఠాత్తుగా ఆ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వారిపై దాడికి ప్రయత్నించారు. ప్రధాన నిందితులైన శివరాత్రి నాగేష్, శ్రీకాంత్ కలిసి ఆ మహిళ, ఆమెతో ఉన్న వ్యక్తి దృశ్యాలను తమ ఫోన్లలో వీడియో రికార్డ్ చేశారు...