భారతదేశం, సెప్టెంబర్ 4 -- OTT Series Jagamae Sangeetham Review In Telugu And Rating: ఓటీటీలో మంచి ఆదరణ పొందిన వెబ్ సిరీస్ 'బండిష్ బ్యాండిట్స్'. ఈ ఓటీటీ సిరీస్ ఆధారంగా రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ 'జగమే సంగీతం'.

ఇవాళ (సెప్టెంబర్ 4) జగమే సంగీతం ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తోంది. తెలుగు మ్యూజికల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన జగమే సంగీతం సిరీస్‌కు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మెయిన్ లీడ్స్‌గా చేశారు. వీరితోపాటు సీనియర్ హీరోయిన్ మధుబాల, అక్షయ్ లాగుసాని, సుస్మితా శెట్టి కీలక పాత్రలు పోషించారు.

నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో జగమే సంగీతం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ మూలంలో హిందూస్తానీ సంగీతం నేపథ్యంగా ఉంటే, తెలుగులోకి వచ్చేసరికి దాన్ని మన దక్షిణాది సాంప్రదాయ కర్ణాటక సంగీతానికి అనుగుణంగా మలిచారు. మరి ఈ ఓటీటీ స...