భారతదేశం, మార్చి 25 -- పాఠశాల పిల్లల కోసం యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా 'యువ విజ్ఞాని కార్యక్రమ్‌' (యువికా)-2026ను ఇస్రో నిర్వహిస్తోంది. యువ విద్యార్థులకు సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్, వాటి అనువర్తనాలపై విద్యార్థులకు ప్రాథమిక అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం.

ఇస్రో యువికా 2026 2026 కోసం విద్యార్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వివిధ అంశాల ఆధారంగా జరుగుతుంది. 8వ తరగతి మార్కులు, క్విజ్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 8వ తరగతి మార్కులకు 50 శాతం వెయిటేజీ ఉంటే.. ఆన్‌లైన్ క్విజ్ కు 10 శాతం వెయిటేజీ ఇస్తారు. సైన్స్ ప్రదర్శనలు/కార్యక్రమాలను కూడా పరిశీలిస్తారు. గత మూడేళ్లలో పాల్గొన్న స్థాయిని బట్టి 2 ...