భారతదేశం, జూన్ 11 -- Isakapatnam Web Series: టాలీవుడ్ లో క్రైమ్ థ్రిల్లర్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, అమెజాన్ ప్రైమ్ వీడియో మరొక పవర్‌ఫుల్ వెబ్ సిరీస్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తోంది. 1990ల కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ 'ఇసకపట్నం' వెబ్ సిరీస్.. ఒక కోస్తా తీర ప్రాంతంలోని పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్, పాలిటిక్స్, గ్యాంగ్ వార్స్ ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టు చూపించబోతోంది. జులై 2 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది.

ఆ ఊరిలోనే చాలా పవర్‌ఫుల్ మనిషి సామ్రాజ్యం మీద ముగ్గురు వ్యక్తుల వల్ల తలెత్తే ముప్పు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం తపించే ఒక మహిళ, నైతిక సంఘర్షణలో ఉన్న అనుచరుడు, ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న ఒక సామాన్యుడు.. ఈ ముగ్గురి పోరాటం ఈ సిరీస్ లో హైలైట్ కానుంది.

ఈ ఇసకపట్...