భారతదేశం, జూన్ 29 -- Irumudi Song: 'ఇరుముడి కట్టు' అంటూ రవితేజ భక్తి పారవశ్యంలో మునిగి తేలాడు. అతను హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ డివోషనల్ థ్రిల్లర్ 'ఇరుముడి' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. 'ఇరుముడి కట్టు' అంటూ సాగుతున్న ఈ పాటలోని లిరిక్స్ భక్తుల మనసులను తాకేలా ఉన్నాయి.

రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఇరుముడి మూవీపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ హైప్ ను మరింత పెంచేలా 'ఇరుముడి కట్టు' సాంగ్ రిలీజ్ అయింది. ఇవాళ (జూన్ 29) ఈ ఇరుముడి సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అయిన ఇరుముడి కట్టును మేకర్స్ విడుదల చేశారు.

స్వామియే శరణమయ్యప్ప అంటూ స్టార్ట్ అయిన ఈ సాంగ్ లాస్ట్ వరకు కూడా భక్తులకు మళ్లీ మళ్లీ వినిపించేలా ఉంది. 'ఇరుముడి కట్టు' అంటూ సాగుతున్న లిరిక్స్ తగ్గట్లుగా భక్తి పారవశ్యంతో రవితేజ మునిపోయి స్టెప్పులు వేయడం ఆకట్టుకుంది. ఈ లిరికల్ ...