భారతదేశం, ఆగస్టు 30 -- Irumudi Record: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. థియేటర్లలో టఫ్ పోటీ ఉన్నా కూడా ఎక్కడా తగ్గకుండా టికెట్ల వేటలో దూసుకెళ్తోంది. రోజురోజుకూ ప్రేక్షకుల ఆదరణ ఊహించని రీతిలో పెరుగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాళ్లను ఈ చిత్రం చేరుకుంటోంది. టికెట్ సేల్స్, కలెక్షన్లలో అదరగొడుతూ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది.

తాజాగా ఇరుముడి సినిమా బాక్సాఫీస్ టికెట్ విండోల వద్ద ఒక అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వేదికలైన 'బుక్‌ మై షో' (BookMyShow), 'డిస్ట్రిక్ట్' (District) లలో గత 24 గంటల వ్యవధిలో అత్యధిక టికెట్లు అమ్ముడైన ఇండియన్ మూవీగా 'ఇరుముడి' సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. నిర్మాతలు వ...