భారతదేశం, మార్చి 8 -- పవిత్రమైన చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలని చాలామంది అనుకుంటారు. అయితే ఇందుకోసం ప్రయాణం, టికెట్లు, భోజనం.. ఇలా ప్రతిదీ కాస్త ఇబ్బందితో కూడుకున్నదే. మీరు కూడా చార్‌ధామ్ వెళ్లాలి అనుకుంటే.. ఐఆర్‌సీటీసీ బడ్జెట్ ధరలో YATRA TO BADRINATH - KEDARNATH - GANGOTRI - YAMUNOTRI (CHARDHAM - NORTH INDIA) EX VISHAKHAPATNAM టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ 12 రోజులు, 11 రాత్రులు. జూన్ 12వ తేదీన టూర్ ఉండనుంది. బద్రీనాథ్, బార్కోట్, గంగోత్రి, గుప్తక్షి, హరిద్వార్, కేదార్‌నాథ్, సోన్‌ప్రయాగ్, యమునోత్రిలాంటి ముఖ్యమైన ప్రదేశాలు కవర్ అవుతాయి.

విశాఖపట్నం నుండి 08:50 గంటలకు బయలుదేరుతుంది. డెహ్రాడూన్ 15:55 గంటలకు చేరుకుంటారు. డెహ్రాడూన్ విమానాశ్రయం నుండి పికప్ చేసుకుని హరిద్వార్‌ తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. హరిద్వార్ దేవాలయాలను ...