భారతదేశం, మార్చి 22 -- ఈ సమ్మర్ వేళ ఊటీ అందాలను వీక్షించాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారికోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. 'అల్టిమేట్ ఊటీ EX హైదరాబాద్ 'పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

ఈ ప్యాకేజీలో భాగంగా ఊటీతో పాటు కూనూర్‌ వంటి టూరిజం ప్రాంతాలను చూసి రావొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 31 మార్చి 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందా లేదా అనేది టూరిజం వెబ్ సైట్ ( https://www.irctctourism.com/ ) లో చూసుకోవాలి.

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే.. కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 33,590గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 18,890 ట్రిపుల్ షేరింగ్ కు రూ. 17170గా నిర్ణయించారు.

స్టాండర్డ్ క్లాస్ లో ట్రిప...