భారతదేశం, నవంబర్ 23 -- న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఏదో ఒక ప్లేస్‌కు ప్లాన్ చేస్తుంటారు. అలాంటివారికోసం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చేంది. కొత్త ఏడాదిలో భాగంగా కొత్త ప్రదేశాలను కూడా మీరు చూడవచ్చు. సెలబ్రేషన్స్ కూడా చేసుకున్న ఫీల్ ఉంటుంది. డిసెంబర్ 31వ తేదీన ఐఆర్‌సీటీసీ Mystical Kashmir-New Year Special టూర్‌ను ప్రకటించింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఆరు రోజులు, 5 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. గుల్మార్గ్, పహల్గాం, సోనామార్గ్, శ్రీనగర్ ప్రాంతాలను సందర్శించి రావొచ్చు. డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ దాకా టూర్ ఉంటుంది.

హైదరాబాద్ నుండి మధ్యాహ్నం 2.30కి ఫ్లైట్ ఉంటుంది. సాయంత్రం 5.30కి శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. మిమ్మల్ని హోటల్‌కు తీసుకువెళ్లి చెక్-ఇన్ చేయిస్తారు. సాయంత్రం మీ ఇష్టం. రాత్రి భోజ...