భారతదేశం, మార్చి 23 -- ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం పర్యావరణానికి పెను శాపంగా మారుతోంది! భూగోళాన్ని వేడెక్కిస్తోంది. క్లైమేట్ ఫోకస్డ్ అనాలిసిస్ ప్రకారం.. గత రెండు వారాల్లోనే ఈ యుద్ధం కారణంగా 50 లక్షల టన్నుల గ్రీన్‌హౌస్ వాయువులు వాతావరణంలోకి విడుదలయ్యాయి. బాంబుల మోత, క్షిపణి దాడులు ప్రపంచానికి హాని చేస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఉద్గారాలకు ప్రధాన కారణం పౌర నివాసాల విధ్వంసం. ఇరాన్ రెడ్ క్రెసెంట్ నివేదిక ప్రకారం.. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 20,000 భవనాలు దెబ్బతిన్నాయి. ఈ భవనాల కూల్చివేత, తదనంతర పరిణామాల వల్ల సుమారు 24 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమానమైన (tCO2e) వాయువులు విడుదలయ్యాయి. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తోంది.

టెహ్రాన్, ఇతర ప్రాంతాల్లోని చమురు క్షేత్రాలపై జరిగిన దాడులు పర్య...