భారతదేశం, ఏప్రిల్ 6 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. మంగళవారం లోగా వాషింగ్టన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో టెహ్రాన్ విఫలమైతే, 'ఇరాన్ మొత్తాన్ని పేల్చివేస్తాను' అని ట్రంప్ అత్యంత తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ పౌరులకు జీవనాధారమైన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తానని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధ నేరాల చర్చకు దారితీస్తోంది. ట్రంప్​ హెచ్చరికలకు ఇరాన్​ భయపడటం లేదు! ట్రంప్​ తాను చెప్పింది చేస్తే, ప్రతిచర్యగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలపై తాము కూడా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

అమెరికా మీడియా సంస్థలతో వరుస ఇంటర్వ్యూల్లో మాట్లాడిన ట్రంప్, రాబోయే 48 గంటల్లో ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరకపోతే "మేము ఆ దేశం మొత్తాన్ని పేల్చివేస్తున్నాం" అని పేర్...