భారతదేశం, మార్చి 12 -- ఓవైపు ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇరాన్ కొత్త సుప్రీం ఆయతుల్లా మెుజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోజ్తాబా ఖమేనీ తన మొదటి ప్రకటన విడుదల చేశారు. గురువారం టెలివిజన్ ప్రసంగంలో ఖమేనీ జాతీయ ఐక్యతకు పిలుపునిచ్చారు. శత్రువులపై ఒత్తిడి తీసుకురావడానికి కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేయడం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అంతేకాదు గల్ఫ్ దేశాల్లోని అన్ని అమెరికా స్థావరాలను వెంటనే మూసివేయాలని లేదంటే అటాక్ చేస్తూనే ఉంటామని హెచ్చరించారు ఇరాన్ సుప్రీం. ఇరాన్ పొరుగు దేశాలతో స్నేహాన్ని విశ్వసిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగుతాయని ఖమేనీ అన్నారు. యెమెన్‌లోని ప్రతిఘటన కూడా పని చేస్తుందని సుప్రీం నాయకుడు అన్నారు. ఇరాక్‌లోని సాయుధ గ్రూపులు కూడా ఇస్లామిక్ విప్లవా...