భారతదేశం, నవంబర్ 11 -- IPS N Sanjay Suspension Extended : సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్‌ సస్పెన్షన్‌ను మరింత కాలం పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయనపై ఉన్న నేరపూరిత విచారణ ముగిసే వరకు లేదా వచ్చే ఏడాది ఆయన ఉద్యోగ విరమణ (రిటైర్మెంట్) పొందే వరకు.అంటే ఈ రెండింటిలో ఏది ముందయితే అంతవరకు సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది.

1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్‌పై తీవ్రస్థాయిలో నిధుల దుర్వినియోగం ఆరోపణలు రావడంతో 2024 డిసెంబర్‌లో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల విభాగంలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన సమయంలో 'అగ్ని ఎన్‌వోసీ' వెబ్ పోర్టల్ అభివృద్ధి, నిర్వహణ పనుల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయనపై ప్రధాన ఆరోపణ ఉంది.

దీంతో పాటు...