IPO GMP : ఇక ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం బంద్.. ఇన్వెస్టర్లకు సెబీ హెచ్చరిక!
భారతదేశం, నవంబర్ 24 -- ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) మార్కెట్లో అనధికారికంగా సాగుతున్న గ్రే మార్కెట్ కార్యకలాపాలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొరడా ఝుళిపించింది. ఐపీఓలకు సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) గణాంకాలను ప్రచురించడం, ఇతరులకు చేరవేయడం తక్షణమే నిలిపివేయాలని మార్కెట్ మధ్యవర్తులు, భాగస్వాములను ఆదేశించింది. నవంబర్ 23 జారీ చేసిన కీలక అడ్వైజరీలో సెబీ ఈ మేరకు స్పష్టం చేసింది. ఒక ఐపీఓ ఏ ధరకు లిస్ట్ అవుతుందో, ఎంత లాభం వస్తుందో అంచనా వేయడానికి జీఎంపీపై ఆధారపడవద్దని ఇన్వెస్టర్లను గట్టిగా హెచ్చరించింది. నియంత్రిత స్టాక్ మార్కెట్ పరిధికి పూర్తిగా వెలుపల జరిగే ఇలాంటి అనధికారిక ప్రీమియం లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచించింది.
కొత్త ఐపీఓ రాగానే కంపెనీ ఆర్థిక పరిస్థితిని చూడటం కంటే ముందుగా "జీఎంపీ ఎంత నడుస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.