భారతదేశం, మే 5 -- హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ (IPL) సందడిని ఆసరాగా చేసుకుని అక్రమంగా కోట్లు సంపాదించాలని చూసిన ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సామాన్య ప్రజలకు టికెట్లు దొరకడమే కష్టంగా మారిన తరుణంలో.. ఈ ముఠా ఏకంగా న్యాయమూర్తులు, మంత్రులు, గవర్నర్ల పేరిట ఫోర్జరీ లెటర్ హెడ్లను సృష్టించి ఖరీదైన టికెట్లను దక్కించుకుంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సమయంలో స్టేడియం పార్కింగ్ ఏరియాలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ, భారీ ధరలకు టికెట్లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. తక్షణమే రం...